: వడ్డేపల్లి మృతి పట్ల సంతాపం తెలిపిన జగన్
కూకట్ పల్లి నియోజకవర్గ వైకాపా నేత వడ్డేపల్లి నర్సింగరావు మృతి పట్ల ఆ పార్టీ అధినేత జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించారు. వడ్డేపల్లి మృతితో వైకాపా ఓ మంచి నాయకుణ్ణి కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు జగన్ సానుభూతిని ప్రకటించారు.