: చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉంటారు... బీజేపీలోకి వెళ్లరు: రఘువీరా


సీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ సారథి చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ పుకార్లను ఖండించారు. చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉంటారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి ఎంతో గౌరవాన్ని ఇచ్చిందని... బీజేపీలోకి వెళ్లాల్సిన అవసరం ఆయనకు లేదని చెప్పారు. ఏ పార్టీకైనా గెలుపోటములు తప్పవని... ప్రజా తీర్పును శిరసావహిస్తామని తెలిపారు. సీమాంధ్ర అభివృద్ధికి సంబంధించి వాచ్ డాగ్ లా వ్యవహరిస్తామని చెప్పారు. చిరంజీవి పార్టీ మారుతున్నారనే వార్తలను మరో కాంగ్రెస్ నేత రుద్రరాజు పద్మరాజు కూడా ఖండించారు.

  • Loading...

More Telugu News