: దండకారణ్యంలో మావోయిస్టుల స్కూల్
ఉద్యమం కోసం పోరాట యోధులను తయారు చేసుకునేందుకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఛత్తీస్ గఢ్ లోని దండకారణ్య ప్రాంతంలో ఒక స్కూల్ ను ఏర్పాటు చేసుకుంది. దీని పేరు 'ద బునియాది మావోయిస్టు ట్రైనింగ్ స్కూల్ (బిసిటిఎస్)'. పోరాట నైపుణ్యాలు, హిందీ భాష, సామాజిక అంశాలు, మ్యాథ్స్, సైన్స్ అంశాలలో బోధన ఉంటుంది.
గిరిజన యువతను మావోయిస్టు దళాలలోకి చేర్చుకుని ముందుగా ఈ స్కూల్ లో ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారు. ప్రతీ బ్యాచ్ లోనూ 30 నుంచి 35 మందికి శిక్షణ ఉంటుంది. భద్రతా కారణాల రీత్యా ప్రతీ బ్యాచ్ కూ స్కూల్ ను మరో ప్రాంతానికి మారుస్తుంటారు.
దండకారణ్య జోనల్ కమిటీ సభ్యుడు కె.రామచంద్రారెడ్డి అలియాస్ రాజు ఈ స్కూల్ కు ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. తక్కెళ్లపల్లి వాసుదేవరావు తదితరులు యువ మావోయిస్టులను తీర్చిదిద్దుతున్నారు. ఈ విషయాలన్నీ ఇటీవలే ఛత్తీస్ గఢ్ పోలీసులకు పట్టుబడ్డ మావోయస్టు కొరియర్ ఒకరు వెల్లడించాడని సమాచారం.