: భారత దౌత్య కార్యాలయంపై ఉగ్రదాడి
ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. భారత్ ను టార్గెట్ చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ లోని హెరాత్ భారత దౌత్య కార్యాలయంపై టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. అయితే, అప్రమత్తంగా వున్న భద్రతా దళాలు ఉగ్రదాడిని సమర్థంగా ఎదుర్కున్నాయి. ఇప్పటికీ భద్రతా దళాలు, టెర్రరిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనపై మన విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ దాడి ఘటనను పర్యవేక్షిస్తున్నామని విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ చెప్పారు. భారత కొత్త ప్రధాని మోడీ ఉగ్రవాదుల పీచమణిచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో, తమ ఉనికిని చాటుకునేందుకే ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడి ఉంటారని అంటున్నారు.