: త్వరలో బ్రిటన్ లో శ్రీనివాసుని కల్యాణం
విదేశాల్లో ఉన్న భక్తులను దృష్టిలో పెట్టుకుని, వివిధ దేశాలలో తిరుమల శ్రీనివాసునికి కల్యాణోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, త్వరలో బ్రిటన్ లో వెంకటేశ్వరుడి కల్యాణం వైభవంగా జరపాలని నిర్ణయించినట్లు టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ రోజు తిరుమలలో తెలిపారు. ఇదిలావుంచితే, సాయంత్రం వేళల్లో స్వామివారి బ్రేక్ దర్శనాన్ని త్వరలో రద్దు చేస్తున్నట్లు ఈవో చెప్పారు.