: రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతాం: టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమా
రైతు రుణమాఫీ చేసి చూపిస్తామని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమా అన్నారు. పేదవారికి 3 సెంట్ల భూమిని ఇస్తామని ఆయన అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖలో విజయమ్మను ఓడించినా జగన్ లో మార్పు రాలేదన్నారు. జగన్ చేస్తున్న విమర్శలపై మాట్లాడే తీరిక చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ అమలు గురించి తమ పార్టీ అధినేత, నాయకులు తలమునకలై ఉన్నారని, రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని ఆయన చెప్పారు. ఇకనైనా జగన్ తమపై విమర్శలు చేయడం మాని, ప్రజా సమస్యలను పట్టించుకుంటే మంచిదని ఉమా హితవు పిలికారు.