: ఆకాశంలోంచి పిజ్జా మీ ఇంటి ముందు దిగితే!


పిజ్జా కోసం ఫోన్ చేశారు. సర్ 5 నిమిషాల్లో మీ ఇంటి ముందు వాలిపోతుంది అని అటునుంచి సమాధానం వచ్చింది. అదెలా అని తల గోక్కుంటూ ఆలోచించేలోపే ఆకాశంలోంచి ఓ చిన్నపాటి డ్రోన్ (మానవ రహిత చిన్నపాటి ఎగిరే వాహనం) మీ ఇంటి ముందు దిగిపోయింది. అందులో వేడి వేడి పిజ్జా, రా రమ్మని.. అంటుంటే దాన్ని ఆనందంగా తీసుకుని ఇంట్లోకి వెళ్లి లాగించేస్తారు కదా. ఇప్పుడు ముంబై వాసులకు ఇదో సరికొత్త అనుభవం అందుబాటులోకి వచ్చింది.

ఫ్రాన్సెస్కో పిజ్జారియా కంపెనీ ఈ నెల 11వ తేదీన తమ హౌస్ నుంచి ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉన్న కస్టమర్ కు డ్రోన్ ద్వారా పిజ్జాను పంపింది. ఇలా ప్రయోగాత్మకంగా డ్రోన్ ను పరిశీలించి చూశామని ఫ్రాన్సెస్కో పిజ్జారియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిఖెల్ రాజాని తెలిపారు. లోయర్ పరేల్ ప్రాంతంలోని తమ ఔట్ లెట్ నుంచి వర్లీ ప్రాంతంలోని ఎత్తయిన భవనానికి పిజ్జాని డెలివరీ చేసినట్లు వివరించారు. దేశంలో డ్రోన్ ద్వారా పిజ్జా డెలివరీ ఇదే మొదటిసారని ఆయన తెలిపారు. డ్రోన్లను అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్లపై దాడులకు అమెరికా ఎక్కువగా వినియోగించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. సరిహద్దుల్లో నిఘాకు కూడా వీటిని వాడుతున్నారు.

  • Loading...

More Telugu News