: వీణా మాలిక్, ఆమె భర్తపై క్రిమినల్ కేసు


పాకిస్థాన్ నటి వీణా మాలిక్, ఆమె భర్త, దుబాయ్ కు చెందిన పారిశ్రామిక వేత్త అసద్ బషీర్ ఖాన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఇటీవలే రహస్యంగా పెళ్లి చేసుకున్న వీణా తాజాగా భర్తతో కలసి అతిథులుగా పాక్ లోని ఓ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన దంపతులు కావడంతో ఆ సందర్భంగా బ్యాగ్రౌండ్ నుంచి ఓ మతానికి సంబంధించిన పాటను ప్లే చేశారు. అదే సమయంలో వీణా దంపతులిద్దరూ ఆ పాటకు నృత్యం కూడా చేశారు. దాంతో, వారు మహ్మద్ ప్రవక్త కుటుంబ సభ్యులను అవమానించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. వెంటనే వారిపై కొంతమంది ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అటు దీనిపై స్పందించిన వీణా, తమపై చేస్తున్న నిందారోపణలకు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News