: సినీ దర్శకుడు సుకుమార్ కు పితృవియోగం


సినీ దర్శకుడు సుకుమార్ తండ్రి తిరుపతిరావు నాయుడు ఇవాళ ఉదయం 11 గంటలకు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరుపతిరావు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తిరుపతిరావు నాయుడు అంత్యక్రియలు గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలో మట్టపర్రు గ్రామంలో జరుగనున్నాయి.

  • Loading...

More Telugu News