: కాలిఫోర్నియాలో ‘అన్నమయ్య జయంత్యుత్సవం’


కాలిఫోర్నియాలోని సన్నివేల్ హిందూ దేవాలయంలో సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ‘అన్నమయ్య జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. శని, ఆదివారాల్లో ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్ తెలిపారు. శనివారం నాడు సంగీత నాట్య పోటీలు, అన్నమాచార్య హరికథ, జయశ్రీ వరదరాజన్ చే అన్నమయ్య సంకీర్తన లహరి, ఈమని కళ్యాణి తో 'అన్నమయ్య సంకీర్తన వీణా విలాసం' తదితర కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.

ఆదివారం నాడు అన్నమయ్య రథోత్సవం, అవ్వారి గాయత్రి మహా సహస్ర గళార్చన, స్వామి పరిపూర్ణానంద సరస్వతి భారతీయ సంస్కృతి వైభవం తదితర కార్యక్రమాలుంటాయి. ముగింపు ఉత్సవాల్లో భాగంగా డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేతుల మీదుగా పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News