: ఇలా అయితే ఆదోనీలో ప్రశాంతత ఎలా సాధ్యం?: టీజీ వెంకటేష్
కర్నూలు జిల్లా ఆదోనీలో ఐదుగురు ఎంఐఎం కార్పొరేటర్లు గెలుపొందారని, ఇక ప్రశాంతత ఎలా సాధ్యమని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ఆయన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
కర్నూలు జిల్లాలో కొన్ని ముస్లిం సంస్థలు రెచ్చగొట్టే ధోరణి అవలంభిస్తున్నాయని, వీరి వల్లే తాను ఓటమి పాలయ్యానని టీజీ ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రలో బీజేపీ పొత్తుతో లాభం చేకూరితే... కర్నూలులో మాత్రం టీడీపీకే నష్టం జరిగిందన్నారు.