: ఉద్యోగుల స్థానికతపై అనుమానాలుంటే... ఆధారాలతో బయటపెట్టాలి: మురళీకృష్ణ


ఉద్యోగుల స్థానికతపై అనుమానాలుంటే కచ్చితమైన ఆధారాలతో బయటపెట్టాలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కన్వీనర్ మురళీకృష్ణ సూచించారు. అంతేకాని, సీమాంధ్ర ఉద్యోగులను పనిచేయనివ్వమంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు.

ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలను పరిష్కరిస్తారని భావిస్తున్నామని మురళీకృష్ణ అన్నారు. సచివాలయంలో 806 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులున్నారని ప్రభుత్వం పేర్కొనగా... అందులో 193 మంది ఉద్యోగుల స్థానికతపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి.

  • Loading...

More Telugu News