: డాక్టర్ కావాలని కలలు కంది.. నేడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది


ఆమె డాక్టరై మంచి పేరు తెచ్చుకోవాలనుకుంది. అందుకోసం ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించేందుకు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది. ఎంసెట్ పరీక్ష రాసేందుకు తల్లితో కలసి సొంత ఊరికి బయల్దేరింది. కానీ, విధివశాత్తు పరీక్షా కేంద్రానికి చేరాల్సిన ఆమె ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కడప జిల్లా రామాపురం మండలానికి చెందిన శ్రావణి హైదరాబాదులో ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది. గురువారం నాడు జరిగే ఎంసెట్ పరీక్ష రాసేందుకు మంగళవారం రాత్రి హైదరాబాదు నుంచి బయల్దేరింది.

ఇవాళ ఉదయం కడప రైల్వేస్టేషన్ లో రైలు దిగుతుండగా ఆమె కాలు ఫ్లాట్ ఫారానికి, రైలుకి మధ్యలో పడి నలిగిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు నుజ్జునుజ్జు అయ్యింది. ఆమెను చికిత్స నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో, మెరుగైన వైద్యం కోసం శ్రావణిని తిరుపతికి తరలించారు. ఆమె ప్రాణాలతో బయటపడాలని... శ్రావణి సన్నిహితులు ప్రార్థిస్తున్నారు.

  • Loading...

More Telugu News