: బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పోర్ట్ బ్లెయిర్ కు వాయవ్య దిశలో 490 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరో 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు చెప్పారు. వాయుగుండం ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తున్నాయి.

వాయుగుండం ప్రభావంతో గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ఈ వాయుగుండం ప్రభావం మన రాష్ట్రంపై పెద్దగా ఉండకపోవచ్చునని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. అయితే, అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News