: ప్రధాని కాబోతున్న మోడీకి కరుణ శుభాకాంక్షలు
ప్రధానిగా పదవీ బాద్యతలు చేపట్టబోతున్న నరేంద్రమోడీకి డీఎంకే అధినేత కరుణానిధి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ లేఖ రాసిన కరుణ, 'ప్రధానిగా మీ (మోడీ) పదవీకాలం సంతోషంగా, సంతృప్తికరంగా సాగాలని కోరుకుంటూ డీఎంకే నుంచి మీకు మా శుభాకాంక్షలు. దేశంలోని అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం' అని పేర్కొన్నారు. కాగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మోడీ ప్రసంగాన్ని ఆయన లేఖలో గుర్తు చేశారు. మోడీ ఉన్నతమైన ఆశయాల సాధనకోసం ఈ దేశం ఎదురు చూస్తోందన్నారు.