: పోలీసుల ఆంక్షలతో మూగబోయిన శ్రీనగర్


హురియత్ గ్రూపునకు చెందిన మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్ నిరసన ప్రదర్శనకు పిలుపునివ్వడంతో పోలీసులు శ్రీనగర్ లో ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దింపారు. తన తండ్రి మీర్వాయిజ్ మొహహ్మద్ ఫరూక్ వర్ధంతి సందర్భంగా శ్మశాన వాటిక వరకూ ప్రదర్శనకు ఉమర్ ఫరూక్ పిలుపునిచ్చారు. షాపులు, విద్యాసంస్థలు, ఇతర వ్యాపార కేంద్రాలన్నీ మూతబడ్డాయి. ప్రజా రవాణా కూడా నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News