: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో పాటు ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా కేరళ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. అయితే, ప్రస్తుతానికి దీని ప్రభావం మన రాష్ట్రంపై అంతగా ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో తెలంగాణ, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు చెప్పారు.