: సిక్కిం ముఖ్యమంత్రిగా పవన్ చామ్లింగ్ ప్రమాణ స్వీకారం
సిక్కిం ముఖ్యమంత్రిగా పవన్ చామ్లింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేసి ఆయన రికార్డు సృష్టించారు. చామ్లింగ్ తో పాటు పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మొన్నటి ఎన్నికల్లో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 22 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అర్హత సాధించింది.