: బీహార్ లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు జంప్


దేశమంతా మోడీ పేరు మార్మోగుతుంటే బీహార్ లో మాత్రం ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వారిద్దరూ జేడీ(యూ)కి జై కొట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ మిశ్రా, రాణా గంగేశ్వర్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేశారు. స్పీకర్ ఉదయ నారాయణ్ చౌదరీని కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు.

దర్బంగా జిల్లాలోని జాలే నియోజకవర్గం నుంచి మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సమస్తిపూర్ జిల్లాలోని మొహియుద్ది నగర్ నియోజకవర్గానికి గంగేశ్వర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరి రాజీనామాతో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 88కి తగ్గింది.

  • Loading...

More Telugu News