: ఇఫ్లూ వద్ద ప్రొఫెసర్లు, విద్యార్థుల ముందస్తు అరెస్టులు
ఇఫ్లూ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులను, రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లను ముందస్తు అరెస్ట్ చేసి, హైదరాబాదులోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఐదుగురు అధ్యాపకులతో పాటు 140 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ముగ్గురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ ‘ఇఫ్లూ’ వద్ద విద్యార్థులు ధర్నాకు దిగుతారని వార్తలు రావడంతో పోలీసులు ముందుగానే బారికేడ్లు ఏర్పాటు చేసి అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కల్పించారు. వర్శిటీ పరిధిలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించిన విద్యార్థుల సంఘీభావ కమిటీని పారా మిలటరీ బలగాలు అడ్డుకున్నాయి.
ఇఫ్లూ విశ్వవిద్యాలయ వైఖరిని నిరసిస్తూ స్థానిక రాజకీయ నేతలు, పౌర సమాజ ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు, వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, విద్యార్థులతో ఈ నెల 23వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆందోళనలో ఉస్మానియా, కాకతీయ, హైదరాబాదు సెంట్రల్ వర్శిటీల ప్రొఫెసర్లు మాట్లాడుతూ... విద్యార్థులతో పాటు తమను సీఆర్సీపీ 151 సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తున్నామని అన్నారు.