: మోడీ ముందు మోకరిల్లాల్సిన అవసరం జగన్ కు ఏమొచ్చింది?: రఘువీరా


వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విరుచుకుపడ్డారు. ఆగమేఘాలమీద వెళ్లి మోడీ ముందు మోకరిల్లాల్సిన అవసరం జగన్ కు ఏమొచ్చిందని ప్రశ్నించారు. తన మీదున్న కేసుల భయంతోనే మోడీ ముందు జగన్ తలవంచారని ఎద్దేవా చేశారు. లౌకికవాదిగా చెప్పుకునే జగన్ మతతత్వ మోడీని ఎలా కలుస్తారని అన్నారు. జగన్ ప్రవర్తనతో క్రైస్తవులు, ముస్లింలు ఆవేదన చెందారని తెలిపారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై జూన్ మొదటి వారంలో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News