: కొత్త రైల్వే జోన్ పై నెల రోజుల్లో నివేదిక: ద.మ.రైల్వే జీఎం
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో ఏర్పాటు చేయబోయే కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై నెల రోజుల్లో నివేదిక తయారవుతుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ తెలిపారు. దీనికోసం ఏర్పాటు చేసిన కమిటీ కొత్త జోన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోందని చెప్పారు. కొత్త జోన్ ఏర్పాటు చాలా సమస్యలతో కూడుకున్నదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న దక్షిణ మధ్య రైల్వేను తెలంగాణకు కేటాయించారు. దీంతో, సీమాంధ్రలో కొత్త జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.