: ఎమ్మెల్యేగా ఎన్నికవ్వకపోయినా... ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడట!
సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు ఓ చిత్రమైన పిటిషన్ విచారణకు వచ్చింది. ఢిల్లీ నివాసి బమ్ బమ్ మహరాజ్ ఈ పిటిషన్ వేశాడు. దాన్ని ధర్మాసనం ఈ రోజు విచారించింది. తాను ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని, ఆహ్వానించాలని కోరినా లెఫ్టినెంట్ గవర్నర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని గవర్నర్ కు ఆదేశాలు జారీ చేయాలని కోరాడు. తనకు ఎమ్మెల్యేలు వినోద్ కుమార్ బిన్నీ, రంబీర్ షోకీన్, అనిల్ ఝా, గుగన్ సింగ్ మద్దతు ఉందని తెలిపాడు. ఇది విన్న ధర్మాసనం ఎంతో ఆశ్చర్యపోయింది. ఎన్నికల్లో పోటీ చేసి గెలవని ఒక వ్యక్తి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని ఎలా కోరగలరని ప్రశ్నించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తూ పిటిషన్ ను కొట్టేసింది.