: కాంగ్రెస్ తో కలసి కొనసాగేది డౌటే: ఒమర్ అబ్దుల్లా
లోక్ సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ (ఎన్ సీ) ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమిపై ప్రజలు వారి అభిప్రాయాలను ఈ మెయిల్ ద్వారా తెలియజేయాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. బుధవారం నుంచి దిద్దుబాటు చర్యలు చేపడతానన్నారు. అయితే, తమ పార్టీలో, కాంగ్రెస్ లో కూడా ఎక్కువ మంది పొత్తుకు ముగింపు పలకాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. శాసనసభ ప్రస్తుత కాలం వరకు కాంగ్రెస్ తో పొత్తు కొనసాగుతుందని, ఆ తర్వాత కొనసాగే విషయం చెప్పలేనన్నారు.