: దానం, దామోదర వర్గీయుల మధ్య ఘర్షణ
హైదరాబాదులో జరిగిన టీపీసీసీ సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ నేతలతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అసమర్థ నేతల వల్లే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయిందని చెప్పారు. ఈ క్రమంలో టీపీపీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహను కార్యకర్తలు చుట్టుముట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ లాంటి పదవుల్లో ఉండి కూడా వ్యక్తిగతంగా గెలవలేకపోయారని... వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి దానం నాగేందర్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.