: జమ్మూలో లోయలో పడిన బస్సు... 17 మంది మృతి


జమ్మూ-శ్రీనగర్ లో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 17 మంది మరణించగా, మరో 27 మంది గాయాల పాలయ్యారు. బస్సు రాంబన్ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత డ్రైవర్ బస్సును అదుపు చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ప్రయాణికుల్లో అత్యధికులు యువకులేనని, వారు రిక్రూట్ మెంట్ ర్యాలీల్లో హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ప్రమాదం బారిన పడ్డారని తెలిసింది. ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో అధికారులు సహాయక చర్యలను చేపట్టారు.

  • Loading...

More Telugu News