: ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటరీ సెంట్రల్ హాల్ లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ సమావేశం ప్రారంభమైంది. మోడీ సహా పార్టీ సీనియర్ నేతలు, అగ్రనేతలు, మిగతా రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే మోడీని పార్టీ పార్లమెంటు నేతగా అగ్రనేత ఎల్ కే అద్వానీ ప్రతిపాదిస్తే... అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు ఈ ప్రతిపాదనను బలపర్చనున్నారు.