: బెంగళూరు వెళ్లేందుకు అనుమతివ్వాలని జగన్ పిటిషన్
కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టును కోరారు. ఎన్నికల ప్రచారం వల్ల బంధుమిత్రులను కలుసుకోలేకపోయానని... అనుమతిస్తే వారందరినీ కలుస్తానని చెప్పారు. ఈ మేరకు జగన్ తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అటు ఓఎంసీ కేసులో నిందితుడైన బీవీ శ్రీనివాసరెడ్డి కూడా బళ్లారి వెళ్లేందుకు అనుమతి కోరారు.