: మా బుజ్జి కుక్కను పట్టిస్తే రూ.5 లక్షలు ఇస్తాం
ప్రేమతో పెంచుకుంటున్న కుక్క కాస్తా కనిపించకుండా పోయేసరికి చెన్నైకి చెందిన దంపతులకు బెంగ పట్టుకుంది. దాంతో 'మేము పెంచుకుంటున్న మోంగ్రెయిన్ జాతి కుక్క ఈ నెల 17న సాలిగ్రామంలోని మా ఇంటి నుంచి తప్పిపోయింది. అదెక్కడుందో కనిపెట్టి తెచ్చిస్తే 5 లక్షల రూపాయల బహుమానం సమర్పించుకుంటాం' అంటూ శరవణన్, సంగీత దంపతులు ఫేస్ బుక్ లో ప్రకటించేశారు. ఫోన్ నంబర్లు కూడా అందులో ఇచ్చారు. అంబూ అనే పేరుతో పిలుచుకునే ఈ కుక్కను గతేడాది తిరుపతిలోని బ్లూక్రాస్ సొసైటీ నుంచి తెచ్చుకున్నామని వారు తెలిపారు.