: ఆభరణాలు చేయమని బంగారం ఇస్తే... ఉడాయించాడు!


కిలో బంగారంతో రాజమండ్రిలోని ఓ స్వర్ణకారుడు కనిపించకుండా పోయాడు. ఆభరణాలు చేయమని తాము ఇచ్చిన బంగారంతో స్వర్ణకారుడు కర్రి అప్పలాచార్యులు పరారయ్యాడంటూ 40 మంది రాజమండ్రి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పలాచార్యులు రాజమండ్రిలోని ఆల్కాట్ తోట జిగ్గర్ పేటలో శాంతి జ్యూయలర్స్ పేరుతో బంగారు నగలు చేస్తున్నాడు. ఆయన 20 ఏళ్లుగా ఆభరణాలు తయారుచేస్తుండటంతో రాజమండ్రి వాసులే కాక ఇతర ప్రాంతాల వారు కూడ నగలు చేయమని అతడికి బంగారం, డబ్బు ఇచ్చారు.

పెళ్లిళ్ల సీజన్ కావడంతో తమ ఇంట్లో జరిగే శుభకార్యాల నిమిత్తం పలువురు అప్పలాచార్యులకు నగలు చేయమని బంగారం ఇచ్చారు. ముహూర్తం దగ్గరపడటంతో ఆదివారం నాడు ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను నిలదీయటంతో వారు... అప్పలాచార్యులు ఇంటి నుంచి వెళ్లి పది రోజులైందని చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. శాంతి జ్యూయలర్స్ లోని రెండు లాకర్లను సీజ్ చేశామని పోలీసులు చెప్పారు. వాటిని రెవెన్యూ అధికారుల సమక్షంలో తెరుస్తామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ శంకర్ చెప్పారు.

  • Loading...

More Telugu News