: జూపల్లిలో ముగిసిన రీపోలింగ్, 96 శాతం పోలింగ్ నమోదు
మహబూబ్ నగర్ జిల్లా జూపల్లిలో 119వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ ముగిసింది. రీపోలింగ్ లో ఇక్కడ 96 శాతం పోలింగ్ నమోదైంది. 867 ఓట్లకు గాను 833 ఓట్లు పోలయ్యాయి. ఇవాళ రాత్రి 8.30 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని అధికారులు తెలిపారు.