: సునీతా విలియమ్స్ కి టీచర్ కావాలనుందట!
అదేమిటి... సునీతా విలియమ్స్ అంటే వ్యోమగామి కదా.. అనుకుంటున్నారా..? ఆమెకు మాత్రం మంచి సైన్స్ టీచరుగా పేరు తెచ్చుకోవాలని ఉందిట. ఇప్పుడు తాను భాగస్వామిగా ఉన్న స్పేస్ షిప్ నిర్మాణం ప్రాజెక్టు పూర్తయ్యాక సైన్సు టీచరు కావాలని ఉన్నట్లు సునీత పేర్కొంది. ముంబాయిలోని స్కూలు పిల్లలతో తన అనుభవాలను పంచుకుంటూ ఆమె ఈ విషయం చెప్పింది.
నిజంగా ఒక రంగంలో పూర్తిస్థాయి పరిణతి సాధించిన వారికి తమలాంటి వారిని అనేకుల్ని తయారుచేయడం కన్నా మించిన ఆనందం మరొకటి ఉండకపోవచ్చు. ఎందుకంటే.. రాష్ట్రపతిగా పదవీవిరమణ చేసిన తర్వాత.. అబ్దుల్ కలాం కూడా తనను మాజీ రాష్ట్రపతి అని వ్యవహరించడం కంటె.. ప్రొఫెసర్ అంటేనే సంతోషిస్తానని పేర్కొన్నారు.