: జగన్ పతనం ప్రారంభమైంది: సోమిరెడ్డి


వస్తున్నాడు, వస్తున్నాడంటూ ఎన్నికల్లో తెగ ఊదరగొట్టేశారని... వచ్చే సంగతేమో కాని, ఇప్పుడు జైలుకు మాత్రం వెళతాడని వైకాపా అధినేత జగన్ ను ఉద్దేశించి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని ఉపేక్షించరాదని సుప్రీంకోర్టు గతంలోనే అభిప్రాయపడిందని తెలిపారు. చంద్రబాబు వయసు గురించి మాట్లాడాల్సిన అవసరం జగన్ కు ఏమొచ్చిందని మండిపడ్డారు. జగన్ దురాశ, కుట్రల వల్ల సీపీఐ, సీపీఎంలు కూడా కొట్టుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. జగన్ పతనం ప్రారంభమైందని అన్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కూడా సోమిరెడ్డి మండిపడ్డారు. సీమాంధ్రలో జగన్ గెలుస్తాడని కేసీఆర్ ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. అవకాశవాదులు, ఫిరాయింపుదారులతో టీఆర్ఎస్ నిండిపోయిందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News