: ఎన్డీఏ సర్కారులో అరుణ్ శౌరీకి ఆర్థికశాఖ?


బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో ఢిల్లీలో ఆ పార్టీ నేత అరుణ్ శౌరీ సమావేశమయ్యారు. కొద్ది రోజుల్లో కేంద్రంలో కొత్త కేబినెట్ కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన శౌరీకి ఎన్డీఏ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ ఇవ్వాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజ్ నాథ్ ఆయనను పిలిపించి మరీ చర్చిస్తున్నారు.

ఇక మిగతా శాఖల వివరాల్లోకి వెళితే... బీజేపీ సీనియర్ నాయకురాలైన సుష్మాస్వరాజ్ కు మానవ వనరుల శాఖ, మురళీ మనోహర్ జోషీకి రక్షణ మంత్రిత్వ శాఖ ఇస్తారని సమాచారం. అటు అమృత్ సర్ నుంచి ఎంపీగా పోటీ చేసి, ఓటమి పాలైన అరుణ్ జైట్లీకి విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కట్టబెడతారని వినికిడి. లోక్ సభ స్పీకర్ గా కరీయా ముండాను నియమించవచ్చని, అగ్రనేత ఎల్ కే అద్వానీని ఎప్పటిలాగే పార్టీ మార్గనిర్దేశకుడిగా ఉండమని అడిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News