సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఎన్డీయే నుంచి ఆహ్వానం అందింది. మంగళవారం జరుగనున్న ఎన్డీయే సమావేశంలో పాల్గొనాల్సిందిగా పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు. దీంతో రేపు పవన్ కల్యాణ్ ఢిల్లీ బయల్దేరనున్నారు.