: కేసుల నుంచి బయటపడేందుకే మోడీని జగన్ కలిశారు: వీహెచ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు నిప్పులు చెరిగారు. ఇవాళ వీహెచ్ ఢిల్లీలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... భారతదేశానికి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని అక్రమాస్తుల కేసుల నుంచి బయటపడేందుకే జగన్ కలుస్తున్నారని ఆరోపించారు. అవినీతిపరులైన జగన్, కేవీపీలను మోడీ జైలుకు పంపాలని ఈ సందర్భంగా వీహెచ్ కోరారు. జగన్ ను జైలుకు పంపేందుకు మోడీపై పవన్ కల్యాణ్ ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు.