: నీలం సంజీవరెడ్డికి రాష్ట్రపతి ఘన నివాళి
భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఘన నివాళులర్పించారు. నీలం సంజీవరెడ్డి 101వ జన్మదినాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్ లోని నీలం చిత్రపటం వద్ద ప్రణబ్ పుష్పగుచ్ఛాలను ఉంచి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జాతికి నీలం సంజీవరెడ్డి చేసిన సేవలను ఆయన కొనియాడారు.
నీలం సంజీవరెడ్డి అనంతపురం జిల్లాలోని ఇల్లూరులో 1913, మే 19వ తేదీన జన్మించారు. 1977వ సంవత్సరం జూలై 25 నుంచి 1982, జూలై 25 వరకు రాష్ట్రపతిగా దేశానికి సేవలందించారు. 1996 జూన్ ఒకటో తేదీన ఆయన మరణించారు.