: ప్రధాని అర్థిక సలహాదారు రంగరాజన్ రాజీనామా
ప్రధాని ఆర్థిక సలహాదారు సి.రంగరాజన్ రాజీనామా చేశారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయిన ఆయన కొంతకాలంగా ప్రధాని ఆర్ధిక సలహా మండలికి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన క్రమంలో ఇప్పటికే ప్రధాని రాజీనామా చేశారు. దాంతో రంగరాజన్ కూడా పదవి నుంచి వైదొలగారు.