: బరువుపై ప్రభావం చూపే వైవాహిక జీవితపు ఆనందం


వైవాహిక జీవితంలో ఉండే ఆనందపు మధురిమలు అనేవి దంపతుల శరీర బరువుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయట. తొలిసారిగా పెళ్లిచేసుకున్న జంటలను నాలుగేళ్లపాటూ పరిశీలించిన మానసిక శాస్త్రవేత్తల బృందం ఈ ఫలితాలను నిగ్గుతేల్చింది. పెళ్ళయన తర్వాత.. వైవాహిక జీవితంలో అనల్పమైన ఆనందపు మధురిమలను ఆస్వాదిస్తూ ఉండేవారు.. బరువు పెరిగే అవకాశం ఉందిట.

అంతా సవ్యంగా ఉన్న దంపతులు.. తాము ఒకరినొకరు ఆకర్షించుకునేలా కనిపించే అవసరం కూడా లేనందున.. శరీరం మీద ఆసక్తి కోల్పోతారని, పైగా అదనంగా ఉండే విందు, వినోదాలు, విచ్చలవిడి ఆహారపు అలవాట్లు కలిసి బాగా లావు పెరిగేలా తీరుస్తాయని అంటున్నారు. 


అదేసమయంలో వైవాహిక జీవితంలో ఆనందం లేని దంపతులు లావు తగ్గుతారని కూడా వీరి పరిశోధనలు చెబుతున్నాయి. డల్లాస్‌ లోని సదరన్‌ మెథడిస్ట్‌ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టు ఆండ్రియా ఎల్‌.మెల్ట్‌జెర్‌ ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలు జరిగాయి. 

  • Loading...

More Telugu News