: ఎంఐఎం సహకారం కోరాం: కేటీఆర్


ఎంఐఎం, టీఆర్ఎస్ నేతల భేటీ ముగిసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీని మర్యాద పూర్వకంగానే కలిశామని ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ శాంతి భద్రతలు, అభివృద్ధి కోసం సహకారం అందించాలని కోరామని చెప్పారు. ఈ విషయంపై కేసీఆర్, అసద్ లు మరింత లోతుగా చర్చిస్తారని వెల్లడించారు. ఇకపై టీఆర్ఎస్, ఎంఐఎంలు కలసి పనిచేస్తాయని చెప్పారు. సీపీఎం కూడా టీఆర్ఎస్ తో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News