: మోడీని పాక్ కు ఆహ్వానించిన నవాజ్ షరీఫ్
కాబోయే ప్రధానమంత్రి నరేంద్రమోడీని పాకిస్థాన్ రావాలంటూ ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆహ్వానించారు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం ఓ ప్రతికా ప్రకటనను విడుదలచేసింది. భారత్, పాక్ మధ్య సంబంధాలు ఎప్పటినుంచో అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి. అటు పాకిస్థాన్ పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దు వద్ద దూకుడుగా వ్యవహరిస్తూనే ఉంది. ఈ రోజు ఉదయం కూడా ఆ దేశ బలగాల కాల్పుల్లో ఓ భారత జవాను కూడా మృతి చెందాడు. ఇలాంటి సమయంలో కొత్త ప్రభుత్వం పాక్ తో ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.