: కాంగ్రెస్ ఓటమిపై పవన్ ప్రభావం లేదు: చిరంజీవి
కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిపై ఆ పార్టీ నేత చిరంజీవి స్పందించారు. ఓటమికి ప్రత్యేకంగా ఒక కారణాన్ని చెప్పలేమని... ఎన్నో కారణాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఓటమిపై తన సోదరుడు పవన్ కల్యాణ్ ప్రభావం లేదనే అనుకుంటున్నానని తెలిపారు. భవిష్యత్తులో పార్టీ పునర్వైభవం పొందేందుకు కృషి చేస్తామని చెప్పారు.