: బీహర్ కు కొత్త సీఎంను ఎన్నుకుంటాం: శరద్ యాదవ్
బీహార్ ముఖ్యమంత్రి పదవికి చేసిన రాజీనామాను నితీశ్ కుమార్ ఉపసంహరించుకుంటారన్న ఊహాగానాలకు జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ తెరదించారు. నితీశ్ కుమార్ రాజీనామా అంతిమ నిర్ణయమని, తగిన చర్చల తర్వాతే పార్టీ ప్రయోజనాల కోణంలో ఆయన రాజీనామా చేశారని శరద్ యాదవ్ చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం జరిగే సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు నితీశ్ రాజీనామాను ఆమోదించి, కొత్త నేతను ఎన్నుకుంటారని తెలిపారు.