: రాజీనామా చేసే యోచనలో సీడబ్ల్యూసీ సభ్యులు
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ మూకుమ్మడి రాజీనామా చేసే యోచనలో సీడబ్ల్యూసీ సభ్యులున్నట్టు తెలిసింది. ఇవాళ సాయంత్రం న్యూఢిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై నేతలు సమీక్షించనున్నారు. ఎన్నికల్లో ఓటమికి సమష్టి బాధ్యత వహించే దిశగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం.