: టీ కాంగ్రెస్ నేతలపై రేణుకా చౌదరి ఫైర్
తెలంగాణలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారకులైన తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవాస్తవాలతో సోనియా, రాహుల్ ను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజిస్తే తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని, సీమాంధ్రలో ఏమీ కాదని చెప్పి మోసం చేశారన్నారు. ఇంద్రులం, చంద్రులం అనుకున్నవారికి ఇప్పుడు నిద్ర పట్టడంలేదన్న రేణుక, అందరూ సీఎం అభ్యర్థులే కానీ, పనిచేసేవారు మాత్రం లేరని వ్యాఖ్యానించారు. సోనియాకు బాధాకరమైన పరిస్థితులు కల్పించింది తెలంగాణ నేతలేనని విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సెటిలర్స్ ను ఆకట్టుకోవడంలో ఫెయిలయ్యారన్నారు.