: అర్హత ఉండబట్టే హరిబాబును విశాఖ ప్రజలు గెలిపించారు: వెంకయ్య


విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసిన కంభంపాటి హరిబాబుకు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టే అక్కడి ప్రజలు గెలిపించారని వెంకయ్యనాయుడు తెలిపారు. కానీ, తొలుత ఆయన పేరు ప్రకటించినప్పుడు అందరూ విముఖత వ్యక్తం చేశారన్నారు. విద్యార్థి నాయకుడిగా జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఆయన, తర్వాత ఆంధ్రా యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారని వివరించారు. తర్వాత పార్టీ కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారని, అనంతరం పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారని తెలిపారు. ఇక వైఎస్సార్సీపీ నుంచి విశాఖకు పోటీ చేసిన విజయమ్మకు వైఎస్ సతీమణి తప్ప ఏం అర్హతలున్నాయని హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకయ్య ప్రశ్నించారు. కేసులున్న వారికే టికెట్లు అనే విధంగా వైఎస్సార్సీపీ అవకాశం కల్పించిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News