: మోడీ నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తారు: యడ్యూరప్ప
నరేంద్రమోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని బీజేపీ ఎంపీ యడ్యూరప్ప అన్నారు. స్విస్ బ్యాంకుల్లో దాగున్న భారతీయుల నల్లధనాన్ని వెనక్కి తెప్పించి అభివృద్ధి కోసం వెచ్చిస్తారని చెప్పారు. విద్య, విద్యుత్, వ్యవసాయం ఇలా అన్ని రంగాలు, అంశాలపై మోడీకి ఒక ప్రణాళిక ఉందని వివరించారు. మోడీ, పార్టీ నాయకత్వం తన పాత్రను నిర్ణయిస్తారని చెప్పారు. ఎంపీగా కర్ణాటక ప్రయోజనాల కోసం కృషి చేస్తానన్నారు.