: తేజ్ పాల్ కు మాతృవియోగం
సహచర జర్నలిస్టుపై లైంగిక దాడి కేసులో నిందితుడైన ప్రముఖ పాత్రికేయుడు, తెహెల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ తల్లి శకుంతల (87) కన్నుమూశారు. బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడుతున్న ఆమె గోవాలోని తేజ్ పాల్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తేజ్ పాల్ ను అనుమతించాలని ఆయన తరపు న్యాయవాది పనాజీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.