: బాబుకు సీఎం స్థాయి ఏర్పాట్లు... స్వగ్రామంలో ఘన స్వాగతం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైన నారావారిపల్లెకు చేరుకున్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానంతరం ఆయన నేరుగా స్వగ్రామానికి వచ్చారు. నారావారిపల్లెలో ఆయనకు బంధుమిత్రులు, టీడీపీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం అక్కడ ఓ పండుగ వాతావరణం నెలకొంది.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణ స్వీకారం చేయనప్పటికీ... ఓ సీఎంకు కల్పించేే పూర్తి స్థాయి భద్రత, అధికారిక లాంఛనాలు ఆయనకు కల్పిస్తున్నారు.