: చంద్రబాబు కాన్వాయ్ లోని వాహనానికి ప్రమాదం
ఈ రోజు ఉదయం చంద్రబాబు తిరుమలకు వెళుతుండగా అపశృతి చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ లోని ఓ వాహనం ప్రమాదానికి గురైంది. కొండమీదకు వెళుతుండగా 4వ కిలోమీటర్ వద్ద అదుపు తప్పిన వాహనం రోడ్డు పక్కన ఉన్న రాతి గోడను ఢీకొంది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.